ఉగాది కల్లా జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు

ఉగాది కల్లా జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు


నేవీ డే లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ , చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు  కలిశారు ఇటీవల అక్రిడేషన్ లకు సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 144 ను
సవరించాలని కోరారు తాజా నిబంధన కారణంగా చిన్న పత్రికలతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న
విలేకర్ల జీవనం
కూడా ఇబ్బందికరంగా తయారవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు అదే సమయంలో విశాఖ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ నగర అధ్యక్షుడు రాంచందర్రావు సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు జీవో నెంబర్ 144 ద్వారా చిన్న పత్రికలకు విలేకర్లకు ఏ రకంగా నష్టం జరుగుతుందో అన్న వివరాలను కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారువిశాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 2005 జర్నలిస్టుల సంఘం కు అప్పగించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పై
ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. దీని పై అధికారుల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.